TG: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారిపై ఐదుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్లలోని ఓ కాలనీకి చెందిన చిన్నారి ఆదివారం ఇంటి వద్ద ఆడకుంటుంది. ఇది గమనించిన బాలిక అన్న సహా బాలురు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. బుధవారం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది.