TG: హైదరాబాద్ శివారులో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బధిర మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. తల్లిదండ్రులకు అనారోగ్యమంటూ నమ్మించి ఆటోలో తీసుకెళ్లిన నిందితుడు.. మరో వ్యక్తితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.