రాజస్థాన్‌లోని కోట్‌పుట్లి-బెహ్రోర్ జిల్లాలో నవంబర్ 26న సాయంత్రం గ్యాంగ్‌వార్ చోటుచేసుకుంది. పాత శత్రుత్వం నేపథ్యంలో, బైక్‌పై వెళ్తున్న ముగ్గురిని థార్ వాహనంతో ఢీకొట్టి, ఆపై కాల్పులు జరిపారు. మరో కారులోని వ్యక్తులు కూడా వారిపైకి దూసుకువచ్చారు. అనంతరం, థార్, స్విఫ్ట్ కారులోని వ్యక్తులు బైక్‌ను ధ్వంసం చేశారు. ఈ సంఘటన సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.