బాలీవుడ్‌ను వణికిస్తున్న గ్యాంగ్‌స్టర్లు

బాలీవుడ్‌ను గ్యాంగ్‌స్టర్ల బెదిరింపులు, దాడుల వార్తలు కలవరపెడుతున్నాయి. గతంలో టీ-సిరీస్‌ అధినేత గుల్షన్ కుమార్ హత్య నుంచి ఇటీవల నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవలే దర్శకుడు రోహిత్ శెట్టి, సల్మాన్ ఖాన్‌ నివాసం వెలుపల కాల్పులు, నటులు రణ్‌వీర్ సింగ్, ఆయుష్ శర్మలకు బెదిరింపులు రావడం వంటి ఘటనల వెనుక కూడా ఇదే గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వస్తున్న బెదిరింపులు సినీ ప్రముఖుల్లో ఆందోళన పెంచుతున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕