భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా' (Dada: The Sourav Ganguly Story) బయోపిక్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో గంగూలీ పాత్రను బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు పోషిస్తున్నారు. విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వంలో లవ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో, రాజ్ కుమార్ రావు గంగూలీ బాడీ లాంగ్వేజ్‌ను అలవర్చుకుంటున్నారు. లార్డ్స్ బాల్కనీలో గంగూలీ షర్ట్ విప్పిన చారిత్రాత్మక క్షణాలను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు.