తిరుమల శ్రీవారి ఆలయంలో మే 31న పౌర్ణమి గరుడసేవ జరగనుంది. ఆరోజు రాత్రి 7 నుండి 9 గంటల మధ్య శ్రీమలయప్పస్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే భక్తులు కానుకగా సమర్పించిన 147 లక్షల వస్త్రాలను (కొత్తవి, ఉపయోగించినవి, పాక్షికంగా దెబ్బతిన్నవి) జూన్ 04 నుంచి 06 వరకు టిటిడి ఆన్‌లైన్‌లో ఈ-వేలం వేయనుంది. ఏపీ ప్రభుత్వ ఈ-కొనుగోలు పోర్టల్‌లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు ఈ వేలంలో పాల్గొనవచ్చు.