పార్టీలలో అలంకరణ కోసం ఉపయోగించే గ్యాస్ నింపిన బెలూన్లు ఎంత ప్రమాదకరమో తెలిపే సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఓ అపార్టుమెంట్ లో మహిళ పార్టీ కోసం ఆర్డర్ చేసిన బెలూన్లను లిఫ్టులో తీసుకెళ్తుండగా అవి అకస్మాత్తుగా పేలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఇలాంటి బెలూన్లను వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.