కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ బ్లో అవుట్

AP: కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, నగరం గ్రామంలో తాడివారిమెరక వద్ద ఓఎన్‌జీసీ రీడ్రిల్లింగ్ పాయింట్‌లో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ బ్లో అవుట్ అయ్యింది. దీనివల్ల సీఎన్‌జీ గ్యాస్ లీక్ కావడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. అధికారులు అప్రమత్తమై ఘటనాస్థలికి చేరుకుని మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది 'వాటర్ అంబ్రెల్లా' ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕