ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా మాల్వాన్ టౌన్‌లో విషాదం చోటుచేసుకుంది. సోమవారం సురేష్ గుప్తా ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి రెండు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో మూడేళ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి 200 మీటర్ల దూరం వరకు భూకంపం తరహా ప్రకంపనలు కనిపించాయి. మరో రెండు ఇళ్లు ధ్వంసమైనా.. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.