గ్యాస్ సిలిండర్ పేలి..ఇద్దరు మృతి (వీడియో)

మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా ఉమర్‌ఖేడ్ తాలూకాలో ఘోర ప్రమాదం జరిగింది. పశువుల సంత మైదానం వద్ద ట్రాక్టర్‌కు వెల్డింగ్ పనులు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕