సిలిండర్ డెలివరీ చేస్తుండగా.. గ్యాస్ లీకై అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన గత నెల 31న బెంగళూరులోని మల్లేశ్వరంలో చోటుచేసుకుంది. డెలివరీ ఏజెంట్ గ్యాస్ సిలిండర్ను ఓ ఇంటికి తీసుకెళ్లాడు. డోర్ వద్ద ఉంచినప్పుడు.. సిలిండర్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీక్ అయింది. అంతకుముందు ఇంటి యజమాని పూజ చేసి గుమ్మం వద్ద దీపం ఉంచారు. లీకైన గ్యాస్ ఆ దీపం మంటకు తాకడంతో.. అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. డెలివరీ ఏజెంట్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.