హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో గ్యాస్ కొరతతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. పిల్లర్ నంబర్ 291 వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గంటల తరబడి లైన్‌లో నిలబడినా రూ.500 గ్యాస్ మాత్రమే ఇస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి వచ్చిన ఫలక్‌నుమా ఏసీపీ జావిద్‌ను కూడా డ్రైవర్లు అడ్డుకుని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.