దేశంలో గ్యాస్ కొరత నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై కేంద్రం విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో ప్రజలు కట్టెల పొయ్యిలను ఉపయోగించుకోవడానికి అనుమతి లభించింది. తీవ్ర కాలుష్యం కారణంగా గతంలో ఈ నిషేధం విధించారు. ఎల్పీజీ సంక్షోభం కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రజలు ఆందోళన చెందవద్దని, సిలిండర్ల కొరత లేదని చెప్పడం గమనార్హం.