గ్యాస్ కొరత.. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధర రూ.1,500!

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారత్‌లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో LPG సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. కొన్ని చోట్ల బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధర రూ.1,500కు చేరింది. యుద్ధం నేపథ్యంలో ఈనెల 7న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60 పెరగడంతో ప్రజలు భయంతో ముందుగానే సిలిండర్ కొని పెట్టుకుంటున్నారు. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకే కేంద్రం సిలిండర్ బుకింగ్‌‌కు 25 రోజుల రూల్ తీసుకొచ్చింది.

సంబంధిత పోస్ట్