టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్

టీమ్ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసింది. భారత జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ను నియమిస్తున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా వెల్లడించారు. 'ఆయనకు స్వాగతం పలకడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం వేగంగా మారుతున్న మోడ్రన్ క్రికెట్ ను గంభీర్ దగ్గరగా చూశారు. తన కెరీర్లో ఎన్నో విభాగాల్లో రాణించి, కష్టాలు పడి భారత క్రికెట్ కోసం ఎంతో కృషి చేశారు. గంభీర్ కొత్త ప్రయాణానికి బీసీసీఐ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది' అని షా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్