జెన్ జీ ఆందోళనలు.. బీజేపీని ఓడించలేదా?

జెన్‌ జీ ఉద్యమాలు, కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. DUSU కీలక నాలుగు పోస్టుల్లో మూడు ABVP గెలుచుకుంది. యశ్ దబాస్ అధ్యక్షుడిగా, రియా చవ్దీ కార్యదర్శిగా, లక్ష్య రాజ్ సింగ్ జాయింట్ సెక్రటరీగా విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా మాత్రం స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ గెలిచారు. జెన్‌ జీ అసంతృప్తి బీజేపీకి వ్యతిరేకంగా మారుతుందన్న అంచనాల మధ్య ఈ ఫలితాలు రావడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్

✕
✕