థియేటర్లకు జెన్ జీ యువత.. బాక్సాఫీస్ వసూళ్లలో 57% వాటా

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీప్లెక్స్ థియేటర్లు 'జెన్ జీ' ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఓటీటీలు, రీల్స్‌తో విసిగిపోయిన యువత మళ్లీ థియేటర్ల వైపు వస్తుండటంతో పరిశ్రమలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఓర్మాక్స్‌ మీడియా నివేదిక ప్రకారం, హిందీ బాక్సాఫీస్ వసూళ్లలో 30 ఏళ్ల లోపు యువత వాటా 57% కాగా, మొదటి రోజు రెవెన్యూలో 70% వాటా వీరిదే. ఒరిజినల్ కథాంశాలతో వచ్చే సినిమాలను యువత ఆదరిస్తున్నారని పీవీఆర్ ఐనాక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ బిజ్లీ తెలిపారు. భవిష్యత్తులో అధునాతన స్క్రీన్లు, టైర్-2, టైర్-3 నగరాలకు విస్తరణ, విభిన్న కంటెంట్‌తో కూడిన చిత్రాలు థియేటర్లను నడిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్