హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతంలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. గర్భంలోని శిశువు లింగాన్ని గుర్తించి వెల్లడిస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు 'డికాయ్ ఆపరేషన్' నిర్వహించారు. ఈ క్రమంలో హయగ్రీవ హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ లు లింగ నిర్ధారణ పరీక్షలకు సహకరిస్తున్నట్లు తేల్చారు. వీరి సహకారంతో తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్‌లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఈ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.