జియో-బీపీ కొత్త 'యాక్టివ్' పెట్రోల్.. వాహనాలకు అదనపు మైలేజ్

ఇంధన రిటైలింగ్ సంస్థ జియో-బీపీ, ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా వినూత్నమైన 'యాక్టివ్' టెక్నాలజీ పెట్రోల్‌ను ఆవిష్కరించింది. ఈ పెట్రోల్ ఇంజిన్ భాగాలను శుభ్రంగా ఉంచుతూ, పనితీరును మెరుగుపరుస్తుంది. అదనపు ఖర్చు లేకుండా వాహనం ఏటా 100 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణించేలా చేస్తుందని సంస్థ తెలిపింది. కోయంబత్తూరులో మోటార్‌సైకిళ్లపై 4,000 కి.మీ. పైగా దీని సామర్థ్యాలను పరీక్షించినట్లు సంస్థ చైర్మన్ సార్థక్ బెహూరియా తెలిపారు. దేశీయ వాహనదారుల అవసరాలకు అనుగుణంగానే ఈ పెట్రోల్‌ను రూపొందించినట్లు వివరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ సంయుక్తంగా జియో-బీపీని ఏర్పాటు చేశాయి.

సంబంధిత పోస్ట్