సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీతో కలిసి 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరో-హీరోయిన్ల మధ్య ఘాటైన లిప్ లాక్ సన్నివేశం ఉందని చిత్ర వర్గాల సమాచారం. ఇద్దరు వారసుల ఎంట్రీతో పాటు ఈ బోల్డ్ సన్నివేశం సినిమాపై అంచనాలను పెంచుతోంది. జయకృష్ణ, రషా ఇద్దరికీ ఇదే తొలి సినిమా కావడంతో, కెమెరా ముందు వారి నటన ఎలా ఉంటుందో చూడాలి.