TG: ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను జీహెచ్ఎంసీ ఉద్యోగులు వాగ్వాదానికి దిగుతూ నెట్టేసిన వీడియో వైరల్ అవుతోంది. బంజారాహిల్స్ లో రాంగ్ రూట్ లో వస్తున్న జీహెచ్ఎంసీ ఏఈతో పాటు ఏఎంఓహెచ్ అసిస్టెంట్‌ను కానిస్టేబుల్ శ్రీశైలం అడ్డుకున్నారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ శ్రీశైలంపై దుర్బాషలాడి నెట్టివేసినట్లు వీడియోలో తెలుస్తోంది.