మధ్యప్రదేశ్ రైసెన్ జిల్లాలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జైంట్ వీల్ హుక్ తెగిపోవడంతో అది పక్కకు ఒరిగిపోయింది. గాలిలో వేలాడిన రైడర్లు భయాందోళన చెందారు. కాపాడాలంటూ కేకలు వేశారు. పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా కిందకు దించారు. ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.