నేడు గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం

TG: హైటెక్ సిటీలోని శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు గిగ్ వర్కర్లతో కలిసి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు జయభేరి గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఫుడ్ డెలివరీ సిబ్బంది, క్యాబ్, ఆటో డ్రైవర్లు వంటి ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికులకు బీమా, ప్రమాద రక్షణ, జీవనోపాధి భద్రత కల్పించడం ఈ పథకం లక్ష్యం.

సంబంధిత పోస్ట్

✕
✕