ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో కండరాల నొప్పి కారణంగా భారత కెప్టెన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. అయితే తొడ కండరాల నొప్పి నుంచి గిల్ కోలుకున్నారని, రేపు కార్డిఫ్‌లో జరగనున్న రెండో వన్డేలో కెప్టెన్ ఆడేందుకు లైన్ క్లియర్ అయిందని సంబంధిత క్రీడావర్గాలు తెలిపాయి. మంగళవారం జరిగిన మ్యాచులో రోహిత్, కోహ్లీ వెంటవెంటనే ఔటైన సమయంలో గిల్ అద్భుత ఇన్నింగ్స్(80) ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.