భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ పై భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను సరైన దారిలో నడిపించాలనే తపన గిల్లో ఉందని, అతను సుదీర్ఘకాలం కెప్టెన్గా కొనసాగుతాడని కోహ్లీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గిల్ నాయకత్వ లక్షణాలపై కోహ్లీ ప్రశంసలు కురిపించడం విశేషం.