స్కూల్ బిల్టింగ్ పై నుంచి దూకి బాలిక ఆత్మహత్య

మహారాష్ట్రలోని జల్నా నగరంలో సీటీఎంకే గుజరాతీ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న ఆరోహి దీపక్ బిట్లాన్ అనే విద్యార్థిని ఉదయం స్కూల్ భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ యాజమాన్యం విద్యార్థినిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు తమ కుమార్తె ఉపాధ్యాయుల చిత్రహింసలు, వేధింపుల వల్లే సూసైడ్ చేసుకుందని ఆరోపిస్తూ, స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్