ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ పాపారావత్ రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మ్యాన్ హోల్‌లో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై బాలికను బయటకు తీశారు. అనంతరం బాలికకు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
గమనిక: రోడ్డుపై నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటించండి.