ప్రియుడి ఇంటి వద్ద బాలిక మృతి

AP: ప్రియుడి ఇంటి వద్ద ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కంపా లాఫీ (17) అనే బాలిక తారకరామనగర్‌లో పిన్ని జయవాణి వద్ద ఉంటోంది. మూడేళ్ల క్రితం నరసింహ రోడ్డుకు చెందిన తన వయసున్న బాలుడితో లాఫీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా ఏర్పడింది. పిన్ని, బాబాయి మందలించడంతో బాలిక ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది నెలలుగా అక్కడే ఉంటోంది. ఏమైందో ఏమో..  వంట గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్