యూపీలోని అమేథిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మదర్సాలో మౌలానా హసీబ్ అనే వ్యక్తి 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక నోటిలో దుస్తులను పెట్టి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తల్లితో తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తల్లి ఆవేదన చెంది అతడిని కొరడాతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.