ట్యూషన్ వెళ్తుండగా లాక్కెళ్లి బాలికపై అత్యాచారం

పశ్చిమ బెంగాల్‌లో మరో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. కోల్‌కతాలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక (14) ఏడో తరగతి చదువుతోంది. ట్యూషన్‌కు వెళ్లేందుకు శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు రాగా ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఆటోలో లాక్కెళ్లి దారుణానికి పాల్పడ్డారు. బాలిక అక్కడి నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్