బెంగళూరులోని తవరేకెరె పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి గంజాయి మత్తులో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన బుధవారం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు అత్యాచారం చేసి, ఆపై సిలిండర్‌తో ముఖంపై కొట్టి, హత్య చేసి పారిపోయాడు. బాలిక సోదరుడు ఇంటికి వచ్చేసరికి ఆమె నగ్నంగా, రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.