సిగరెట్లు తాగిన బాలికలు.. వీడియో వైరల్

సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో కొందరు బాలికలు విపరీత పోకడలకు పాల్పడుతున్నారు. తాజాగా కర్ణాటక తుమకూరులోని ఓ ప్రభుత్వ స్కూల్ ఆవరణలో విద్యార్థినులు సిగరెట్లు తాగిన ఘటన కలకలం సృష్టించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను చదివిస్తుంటే, వారు ఇలాంటి పనులు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తప్పులు జరగకుండా విద్యార్థినులకు లెక్చరర్లు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్