మా ఇల్లు మాకిప్పించండి.. కలెక్టర్‌నే నిలదీసిన 13 ఏళ్ల బాలుడు!

యూపీలోని లఖింపూర్ ఖేరిలో 13 ఏళ్ల అమితాబ్ గుప్తా అనే బాలుడు తన కుటుంబం కోసం జిల్లా కలెక్టర్‌ను నిలదీసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మానసిక రోగి అయిన తండ్రి, పేదరికం వల్ల ఇబ్బంది పడుతున్న తల్లి కోసం ఆస్తి వివాదంపై కలెక్టరేట్‌లో ధైర్యంగా మాట్లాడాడు. బంధువులు తమ ఉమ్మడి ఆస్తి అయిన ఇంట్లోని కొంత భాగానికి తాళం వేశారని, దానిని ఇప్పిస్తే అద్దెకు ఇచ్చి వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవచ్చని అధికారులకు వివరించాడు. . స్పందించిన డీఎం తక్షణ విచారణకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్