చర్మ సంరక్షణలో బియ్యం పిండి కీలక పాత్ర పోషిస్తుంది. ఎండ వల్ల దెబ్బతిన్న చర్మాన్ని కాంతివంతం చేయడానికి, చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి బియ్యం పిండి ఫేస్ ప్యాక్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. పెరుగు, కొబ్బరి పాలు, నిమ్మరసం, కలబంద, తేనె వంటి వాటితో బియ్యం పిండిని కలిపి సులభంగా ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. వీటిని వారానికోసారి వాడటం వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. అయితే, ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, టీవీ9 దీనిని ధృవీకరించడం లేదు. సందేహాలుంటే నిపుణులను సంప్రదించాలి.