గోవా అగ్నిప్రమాదం..మృతులకు ఎక్స్‌గేషియా ప్రకటించిన సీఎం

గోవాలో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాద బాధితులకు సీఎం ప్రమోద్ సావంత్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ అగ్నిప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్