చర్మ ముడతలను తగ్గించేందుకు బీక్ మాన్ 1802 సంస్థ ‘మిల్క్ RX కంప్రెస్’ మాస్క్‌ను పరిచయం చేసింది. ‘బెటర్ ఏజింగ్’ విధానంలో రూపొందిన ఈ మాస్క్‌లో రెనెక్సోసోమ్ కాంప్లెక్స్, మేకపాలు, మొండో గ్రాస్ ఉన్నాయి. ఇవి కొలాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని 20 నిమిషాల్లో రిపేర్ చేయడంలో సహాయపడతాయి. తేమను నిలుపుతూ ఎరుపుదనం, వాపు తగ్గిస్తాయి. వారానికి ఒకసారి వాడితే చర్మం కాంతివంతంగా మారుతుందని సంస్థ పేర్కొంది.