గోదారోళ్ల మర్యాదలు.. కొత్త అల్లుడికి 200 రకాల వంటలతో విందు

AP: పశ్చిమ గోదావరి జిల్లాలో దీపావళి సందర్భంగా అత్తింటికి వచ్చిన కొత్త అల్లుడికి తులసీ రాంబాబు దంపతులు అద్భుతమైన సర్‌ప్రైజ్ విందు ఏర్పాటు చేశారు. వంద రకాల నాన్-వెజ్, వంద రకాల వెజ్ వంటకాలు, స్వీట్స్, పిండి వంటలతో మొత్తం 200 రకాల వంటకాలను సిద్ధం చేశారు. ఇందులో పండుగప్ప, రామలు, కొరమీను, నాటుకోడి, 20 రకాల బిర్యానీలు, తందూరి ప్రాన్స్, మటన్ హలీమ్, స్టఫ్డ్ ఎగ్, డ్రాగన్ చికెన్ వంటి ప్రత్యేక వంటకాలు ఉన్నాయి. అల్లుడు రాహుల్ ఈ విందుని చూసి ఆశ్చర్యపోయారు.

సంబంధిత పోస్ట్