గోదావరి నది వరద నీటిని కృష్ణా, పెన్నా బేసిన్‌లకు తరలించే ప్రాజెక్టే బనకచర్ల-గోదావరి ప్రాజెక్టు. దీని లక్ష్యం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి, సాగునీటి సమస్యలను పరిష్కరించడం. దీనివల్ల 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 80 లక్షల మందికి తాగునీరు అందుతుంది. దీని నిర్మాణానికి దాదాపు రూ. 80,000 కోట్ల ఖర్చవుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఈ ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తూ గోదావరి నీటి హక్కులు, పర్యావరణ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తుంది.