ఏపీలోని భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలవరం, పట్టిసీమ గ్రామాల వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పోలవరం జలాశయం వద్ద నీటిమట్టం భారీగా పెరుగుతోంది. దీనికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రాజెక్టు స్పెల్ వే ఎగువన 31.43 మీటర్లు, స్పెల్ వే దిగువన 22.60 మీటర్లు కాగా 48 రేడియల్ గేట్ల ద్వారా 7,43,222 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ అధికారుల తెలిపారు.