TG: ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం 17 అడుగులు ఉన్న గోదావరి ప్రవాహం ఆదివారం ఉదయానికి 40 అడుగులు దాటింది. దీంతో స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు నీట మునిగాయి. నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.