బంగారం, వెండి ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి: కారణాలివే

డాలర్ ఇండెక్స్ తగ్గుదల, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు రెండు రోజుల్లో రూ.38,000 కంటే ఎక్కువ పెరిగి రూ.2,98,300 కు చేరుకుంది. బంగారం ధరలు కూడా రెండు రోజుల్లో రూ.12,000 లకు పైగా పెరిగి రూ.1,65,100 కు చేరాయి. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రాబోయే అణు చర్చలపై ఆశలు దెబ్బతినడం వంటి కారణాలతో బంగారంపై రిస్క్ ప్రీమియం పెరిగి, విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్