భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,510 తగ్గి రూ.1,50,170కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.2,300 తగ్గి రూ.1,37,650గా నమోదైంది. కేజీ వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,45,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. ధరలకు 3% జీఎస్టీ అదనం.

సంబంధిత పోస్ట్

✕
✕