బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా, వెండి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గి రూ.1,39,650కి పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.380 తగ్గి రూ.1,52,350కు చేరింది. కేజీ వెండి ధరపై రూ.5,000 తగ్గి రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.