బంగారం, వెండి ధరలు బుధవారం అత్యంత భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.6,050 పెరిగి రూ.1,47,150కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.6,600 పెరిగి రూ.1,60,530 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.20,000 పెరగడంతో రూ.3,20,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.