బంగారం, వెండి ధరలు సోమవారం మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,350 పెరిగి రూ.1,24,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.1,470 పెరిగి రూ.1,35,380 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 పెరగడంతో రూ.2,15,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.