పెరిగిన బంగారం, వెండి ధరలు

కొద్దిరోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు శుక్రవారం పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.99,000కు చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రా. ధర రూ.550 పెరిగి రూ.90,750కి చేరింది. అలాగే కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,21,000 పలుకుతోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్