అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.500 పెరిగి రూ.1,49,080కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరిగి రూ.1,36,650 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.5,000 ఎగబాకి రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.