పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.650 పెరిగి రూ.1,17,750కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.710 పెరిగి రూ.1,28,460 పలుకుతోంది. వెండి ధర మరోసారి ఆల్ టైం రికార్డుకు చేరింది. కేజీ వెండిపై ఏకంగా రూ.3,000 పెరిగి రూ.1,83,000 వద్ద ధర కొనసాగుతోంది. 4 రోజుల్లో కేజీ వెండిపై రూ.12,000 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.

సంబంధిత పోస్ట్