మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

దీపావళి పండుగ వేళ బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. ఉదయం స్వల్పంగా పెరిగిన ధరలు మధ్యాహ్నానికి మరింత ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,160 పెరిగి రూ.1,42,800 పలుకుతోంది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,900 పెరిగి రూ.1,30,900కు చేరుకుంది. మరోవైపు కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.2,10,000కు చేరింది. వీటిపై 3శాతం జీఎస్టీ అదనం.

సంబంధిత పోస్ట్

✕
✕