దేశవ్యాప్తంగా బంగారం, వెండి కొనుగోళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. రికార్డ్ స్థాయిలో పెరిగిన ధరలు తగ్గుముఖం పడుతున్నా.. జనం మాత్రం కొనుగోళ్లకు ఇంకా వెనకడుగు వేస్తున్నారు. దీంతో బంగారం, వెండి అమ్మకాలతోపాటు దిగుమతులు కూడా భారీగా పడిపోయాయి. ఈ ఏడాది మార్చిలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,69,000కు చేరగా, ప్రస్తుతం రూ.1,45,000గా ఉంది. వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది. హైదరాబాద్‌లోనూ అమ్మకాలు 35-40 శాతం పడిపోయాయి. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచింది. యువత డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే పండగల సీజన్‌లో అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు.